మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని సింగరేణి సంస్ధ ఇల్లందు క్లబ్ సోమవారం సంస్ధ డైరెక్టర్ (పా అండ్, ఫైనాన్స్) ఎన్. బలరాం , పర్సనల్, ఫైనాన్స్ ,సివిల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న సింథెటిక్ లాన్ టెన్నిస్ కోర్టు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ… నూతనంగా నిర్మించే సింథెటిక్ లాన్ టెన్నిస్, క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రదర్శనలు తిలకించుటకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండే విధంగా నిర్మించాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు తగిన సూచనలు సలహాలు చేశారు. ఈ సింథెటిక్ కోర్టు వల్ల క్రీడాకారుల మోకాళ్ళకు ఎలాంటి గాయాలు కావని, బంతి అసాధారణంగా బౌన్స్ కాదని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ అంటేనే సంక్షేమానికి మారుపేరు అని, సంస్థ సంక్షేమానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.ఈ పరిశీలనలో జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె. బసవయ్య, జిఎం ఫైనాన్స్ ఎం సుబ్బారావు, ఎస్‌ఓ టు జిఎం ఫైనాన్స్ సుధీర్, ఏజిఎం పర్సనల్ ,కవితానాయుడు, డిజిఎం పర్సనల్ లు కె. శ్రీనివాస రావు, ధన్పాల్ శ్రీనివాస్, ఏజిఎం సివిల్ రామకృష్ణ, డిజిఎం ఈ&ఎం రాజీవ్ కుమార్, తదీతరులు ఉన్నారు.