మన్యం న్యూస్ బూర్గంపహడ్:- భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో భాగంగా సోమవారం కోయగూడెం గ్రామ పంచాయతీ లో స్థానిక సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు,తాళ్లగొమ్మూరులో నూతనం గా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను పరిశీంచిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.వారితో పాటు స్థానిక సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి,బూర్గంపహడ్ పిఏసిఎఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,బూర్గంపహడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మి చైతన్య రెడ్డి,మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ,వార్డు మెంబర్లు జామ లక్ష్మి,లంకపల్లి సలమ్మ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోము రోసిరెడ్డి,బెజ్జంకి కనక చారి,చిరంజీవి,తుపాకుల రవి,తాటికల్లు సతీష్,ప్రభాకర్,సజ్జు అదేవిధంగా గ్రామపెద్దలు మండల,టౌన్ కార్యకర్తలు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.