మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి డి ఆర్ ఓ రమాదేవి లతో కలసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. అలాగే వివిధ శాఖలో మంజూరై పెండింగ్లో ఉన్న పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ లో సిబ్బంది తప్పనిసరిగా హాజరు వేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.మీసేవ ఆన్లైన్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని సంబంధించిన అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమైన దృశ్య విద్యార్థుల హాజరు శాతాన్ని,అదేవిధంగా హాస్టల్లో విద్యార్థుల హాజరు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున గోదావరి పరివాహక ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం,ఏటూరు నాగారం,మంగపేట కన్నాయి గూడెం, మండలాలలోని కిరాణా షాప్ యజమానులకు బప్పర్ స్టాక్ పెట్టుకోవాలని ముందస్తు సమాచారం తెలిపి మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రజావాణి కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రసన్న రాణి,జిల్లా వైద్య అధికారి అప్పయ్య,జిల్లా ప్రణాళిక అధికారి ప్రకాష్ తో పాటు తదితర అధికారులు పాల్గొన్నారు
