UPDATES  

 బ్రిలియంట్ విధ్యార్థులకు ఘన సన్మానం*

 

మన్యం న్యూస్ బుర్గంపహడ్:- సారపాక బ్రిలియంట్ పాఠశాల విధ్యార్ధులు నవోదయ పరీక్షల్లో విజయడంకా మ్రోగించారు,ఈ నెల 21వ తేదీన ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాలు జాతీయస్థాయిలో తన ప్రతిభ పాటవాలను నిరూపించుకొని నవోదయలో సీట్లు సాధించిన సందర్భంగా సారపాక గ్రామపంచాయతీ ఈఓ మహేష్ విద్యార్థులకు మెమెంటో అందించి,శాలువాలతో సత్కరించారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.మండలంలో ఇంత మంది విద్యార్థులను జాతీయ స్థాయి విద్యలో మొదటి స్థానంలో నిలుపుతున్నందుకు బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి,ఎన్,ఆర్ నీ సభాముఖంగా అభినందనలు తెలియజేశారు,మన మండలంలో ఇంత మంచి గౌరవ పాఠశాల ఉన్నందుకు గర్వపడుతున్నామని ఇకముందు కూడా నవోదయ మరియు జూనియర్ కాలేజ్ స్థాయిలో మెయిన్స్,ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించి మన మండలానికి సారపాక పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.అనంతరం చైర్మన్ బిఎన్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇకపై కూడా క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,ఇంతటి విజయానికి సహరించిన తల్లిదండ్రులకు,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బిఎన్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సారపాక గ్రామ పంచాయతీ ఈఓ మహేష్,ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !