అన్నదాతను ఆదుకున్న విత్తన వ్యాపారి*
రైతుకు చేయూతని అందించడం ఆనందంగా ఉంది వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు
మన్యం న్యూస్ గుండాల: అన్నదాతను ఆదుకున్న గుండాల మండలానికి చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్, విత్తన వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు. గత సంవత్సరం గుండాల మండలం జగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన తోలెం సమ్మయ్య కు చెందిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదానికి గురై లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లడంతో ఈ ఏడాది కొంత ఇబ్బంది గురవుతున్న సమయంలో విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు ఆ రైతుకు 15 మొక్కజొన్న ప్యాకెట్లను అందించారు. ఎన్నో ఏళ్లుగా తన వద్ద అన్ని రకాల విత్తనాలను ఎరువులను కొంటున్నాడని అలాంటి రైతును ఆదుకున్నందుకు ఆనందంగా ఉందని మానాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారస్తులు మానాల ప్రణీత్ కుమార్, ఇల్లందుల అప్పారావు, రైతులు సమ్మయ్య, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు
