మన్యం న్యూస్ చండ్రుగొండ,జూన్ 26: ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టిఎస్ఆర్టీసీ కొత్తగూడెం డిపో ఆద్వర్యంలో విద్యార్ధులకు ఉచిత బస్ పాస్ మేళాను నిర్వహించారు. విద్యార్దులకు హెచ్ఎం చేతుల మీదుగా బస్ పాసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ…1నుంచి 7వ తరగతి వరకు బాలురలకు, 1 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు ఉచిత బస్ పాసులను అందజేయటం జరుగుతుందన్నారు. విద్యార్ధులు 20కిలో మీటర్ల దూరం వరకు ఉచిత బస్ పాసులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది ఎండి యాసర్, శివరామక్రిష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.