UPDATES  

 వ్వవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.కనీస వేతనం 600 రూపాయలకై పోరాడుదాం

వ్వవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.కనీస వేతనం 600 రూపాయలకై పోరాడుదాం.
అఖల భారత ప్రగతి శీల వ్వవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి-పోతుగంటి లక్ష్మణ్.

మన్యం న్యూస్. ములకలపల్లి.జూన్26.

వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కై పోరాడాలని అఖిల భారత ప్రగతిశీల వ్వవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా మండల కమిటీ ఆధ్వర్యంలో తహాశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు,అనంతరం తహాశీల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం డివిజన్ కార్యదర్శి పోతుగంటి లక్ష్మణ్ మాట్లాడుతూ, దేశంలో 60% మంది వ్వవసాయ రంగంలో పనిచేస్తున్నారని,వారిలో 14 కోట్ల మంది వ్వవసాయ కార్మికులు వున్నారు.సేద్యం ప్రారంభం నుండి విత్తనాలు విత్తడం,నాట్లు వేయడం,కలుపులు తీయడం,నీళ్ళు పెట్టడం,సస్యరక్షణ, అన్ని పంటల సేకరణ, పంటల కోతలు తదితర పనులు చేస్తూ చాలి చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, తక్కవ ఆదాయాలతో తగినంత ఉపాధి లేక పోవటంతో పెరుగుతున్న ధరల కనుగుణంగా వ్యవసాయ కార్మికుల వేతనాలు కనీసం 600 రూపాయలు పెంచాలని అఖిల భారత ప్రగతి శీల వ్వవసాయ కార్మిక సంఘం డిమండ్ చేస్తుందని తెలిపారు. వ్వవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని,50 సంవత్సరాలు దాటిన వ్వవసాయ కార్మికులకు ఐడి కార్డులు ఇచ్చి 10 వేలు జీవన భృతి ఇవ్వాలని,ఇండ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం 5 లక్షలు,రాష్ట్రం 5 లక్షలు ఇవ్వాలని,వ్వవసాయ కార్మికుల కుటుంబాలకు నాణ్యమైన విద్యా, వైద్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి, ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్,నకిరకంటి నాగేశ్వరరావు, ఇరపా వీరస్వామి, మొడియం వెంకటేష్,కుంజా శ్రీను,వీరస్వామి,రవి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !