మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 26::
ఆదివాసుల ఇల వేల్పుల సంరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని లేకుంటే ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సోయం ఇలవేల్పుల కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆదివాసి రాష్ట్ర అధ్యక్షులు వీరభద్రం అన్నారు దుమ్ముగూడెం మండలంలోని నదులు చిలక గ్రామంలో సోయం వేల్పుల జాతరలో నాలుగు రాష్ట్రాల నుండి సోయం వంశీయులు 500 మందితో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోయం వీరభద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ ఆధునీకరణ వ్యవస్థలో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు భాష వస్త్ర వేషధారణ మూలాలను మరిచిపోతున్నామని ఇది ఆదివాసి భవిష్యత్తులో ప్రమాదమని హెచ్చరించారు మన వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు ఆదివాసి సంప్రదాయాలను తెలియజేయాలని ఆదివాసి ప్రజల ఆరాధ్య దేవాలయం ఇలవేల్పులను పునరుద్ధరణ చేసి సంరక్షించుకోవాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు నిజం నిర్వం కుసత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆదివాసి యోధుడు సోయం వంశీయుడు కావడం గర్వకారణమని ఈ సందర్భంగా గుర్తు చేశారు మనందరం సోయం గంగులు పేరుతో భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో స్వయం గంగులు శృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సోయం వంశీయులు అందరూ ఘనంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య రాష్ట్ర ఆదివాసి నాయకులు వీరభద్రం ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆదివాసి ఇలవేల్పుల సంరక్షణ జాతీయ నాయకులు రాములు సతీష్ గాడు నాయకులు సోయం మూక ఆదివాసి తగల సమయాన్ని కర్త స్వయం కన్నారావు సత్యనారాయణ కృష్ణ కోటేష్ చలపతి కృష్ణమూర్తి నందులచలక గ్రామస్తులు పెద్దలు మహిళలు యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.