మన్యం న్యూస్, అశ్వారావుపేట, జూన్, 26: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో బోధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందించే ఉచిత టాబ్స్ పంపిణీ నీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి సోమవారం ప్రారంభించి మొత్తం 55 టాబ్స్ నీ పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారని, దానిలో భాగంగా ఉపాధ్యాయులకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి ఒక్క పాఠశాలలో స్టూడెంట్ డేటా ట్రాన్స్ఫర్స్ అండ్ మిడ్ డే మీల్స్ అటెండెన్స్ పలు రకాల సదుపాయాలకు ఈ ఒక్క టాబ్స్ ఉపయోగించనున్నారు అనీ అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మండల నాయకులు మందపాటి రాజ మోహన్ రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్, జిల్లా టెక్నికల్ పర్సన్ మోహన్, ఎంఈఓ కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయులు నరసింహం, మహబూబ్, ప్రభాకర చార్యులు, మాలోతు రామారావు తదితరులు పాల్గొన్నారు.