మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ మామిడి గూడెం గ్రామానికి చెందిన భూములను ఫారెస్ట్ వారు ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని తక్షణమే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు చర్ల దుమ్ముగూడెం సభ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. సోమవారం భద్రాచలంలోని ఐటిడి ఆఫీస్ కార్యాలయం ముందు మామిడిగూడెం ప్రజలతో పోడు భూముల సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ ధర్నాని ఉద్దేశించి గౌని నాగేశ్వరరావు సతీష్ లు ప్రసంగించారు.మామిడిగూడెం ప్రజలు 1995 కు ముందు నుంచే ఆ భూములో సాగు చేసుకుని అనేక నిర్బంధాలను ఎదుర్కొని కేసుల పాలై ఆ భూములలో సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ వారు ఈ 2019లో వచ్చి అవి మొక్కలు నాటి వారి పంటలను ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని ఎన్నో సంవత్సరాలుగా సాగులో ఉన్న భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూనే గిరిజన యొక్క పోడు భూములను లాక్కోవడం విడ్డూరంగా ఉందని వారన్నారు మామిడి కూడా ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటుంటే వారి భూములకు పట్టాలి ఇవ్వకపోగా ఫారెస్ట్ వారు ప్రభుత్వం కల్పి ఈరోజు వారి భూముల్ని మొక్కలు నాటడం మంచి పద్ధతి కాదని వారన్నారు అలాగే ఈ మధ్యకాలంలో సాగు చేసుకుంటున్న మహిళలపై బీట్ ఆఫీసర్ చేయి చేసుకోవడం అసభ్యకరంగా ప్రవర్తించడం మంచిది కాదని తక్షణమే ఆ బీటా ఆఫీసర్ పేరు తీసుకొని మామిడిగూడెం ప్రజల భూములకు పట్టాలు ఇవ్వాలని ఆ భూములకు వాళ్లకే చెందే విధంగా పిఓ ఆలోచించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు జక్కుల రాంబాబు , సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పెంటమ్మ లక్ష్మి, ఆదిలక్ష్మి, సుశీల, వెంకటేశ్వర్లు, రామారావు వరలక్ష్మి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
