UPDATES  

 అగ్ని ప్రమాద బాధితులకు లయన్స్ క్లబ్ వితరణ..

 

మన్యం న్యూస్ దుమ్మగూడెం జూన్ 26::
మండలంలో పెద్ద బండి రేవు గ్రామంలో సోయం రాజమ్మ, సమ్మక్క కుటుంబాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంబంధించి ఇల్లు కోల్పోయి బాధిత కుటుంబాలకు లయన్స్ క్లబ్ భద్రాచలం చేయూతని అందించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనతో వెంటనే విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు యోగి సూర్యనారాయణ బాధితులకు 50 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు కూరగాయలు 2000 నగదును అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆదివాసి గిరిజన కుటుంబం కొలుకోలేని దెబ్బని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుండు శరత్ ప్రశాధికారి భరత్ కుమార్ సభ్యులు రంగారెడ్డి సునీల్ కాంత్ సూర్యచంద్రరావు ఆదినారాయణ కారం పుల్లయ్య ఎంపీటీసీ వంశీకృష్ణ ఉపసర్పంచ్ ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !