మన్యం న్యూస్, మణుగూరు:
మణుగూరు మండలం లోని బి ఆర్ యస్ పార్టీ ఎం పి టి సి లు, గ్రామ పంచాయతీ ల సర్పంచ్ ల సమావేశం జడ్ పి టి సి కార్యాలయం లో జడ్ పి టి సి పోషం. నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పోషం. నరసింహారావు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల. చంద్ర శేఖర్ రావు , ప్రభుత్వ విప్, ఎం ల్ ఏ రేగా. కాంతారావు కృషి తో గ్రామ పంచాయతీ ల అభివృద్ధి కి, మేజర్ గ్రామ పంచాయతీ ల నుంచి మొదలుకొని చిన్న పంచాయతీ లు తాండలవరకు సొంత కార్యాలయం లు కు నిధులు మంజూరు, ఒక్క ఒక్క గ్రామ పంచాయతీ కి 10 లక్షలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పదం లో నిలిపారు అని కొనియాడారు. అదేవిదంగా మండలపరిషత్ లకు కూడ అధిక మొత్తం లో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని అన్నారు. మణుగూరు మండలం లో సి సి రోడ్లు, సైడు డ్రైన్లు దాదాపు అన్నీ పూర్తి కావచ్చాయని అన్నారు.ఈ సమావేశం లో ఎం పి పి కారం. విజయకుమారి గారు, ఎం పి టి సి ల ఫోరమ్ అధ్యక్షులు గుడిపూడి. కోటేశ్వరరావు, ఎం పి టి సి లు, అన్ని గ్రామ పంచాయతీ ల సర్పంచ్ లు పాల్గొన్నారు.