మన్యం న్యూస్ చండ్రుగొండ, జూన్ 27: రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కిందని జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మద్దుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా నైటింగేల్ అవార్డు గ్రహీత(ఏఎన్ఎం) తేజావత్ సుశీల దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాసేవలో ఉన్న ప్రతి యొక్కరికి ఎప్పటికైనా సరియైనా గుర్తింపు లభిస్తుందనటానికి ఈ అవార్డు రావడం ఒక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. పేదలకు, బడుగు, బలహీనవర్గాలకు వైద్య సేవలు అందించటంలో సుశీల అంకితభావంతో పనిచేసిందన్నారు. విధుల పట్ల నిజాయితీగా పనిచేస్తే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పద్దం వినోద్, ఎంపిటీసీ బొర్రా లలిత, ఎంపిడిఓ రేవతి,జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మంగవేణి, మెడికల్ ఆఫీషర్ తన్మయి, వైద్యురాలు ప్రియాంక, మాజీ ఎంపీపీ గుగులోత్ బాబు, జిపి సెక్రటరి క్రిష్ణకుమారి, వైద్యసిబ్బంది భవాని, గ్రామ పెద్దలు, నాయకులు నల్లమోతు రమణ, అంజిబాబు, సంకా కృపాకర్, రాజేశ్వరరావు, అజీజ్, నాగేశ్వరరావు, అంతటి రామక్రిష్ణ. మనోహర్, తదితరులు పాల్గొన్నారు.