మన్యం న్యూస్ దుమ్మగూడెం జూన్ 28::
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి అన్నారు. మండలంలోని పెద్ద బండి రేవు గ్రామానికి చెందిన సోయం రాజమ్మ ఇల్లు గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచిన సర్పంచ్ వరలక్ష్మి పర్ణశాల గ్రామపంచాయతీ యువత కుటుంబానికి మేమున్నం అనే భరోసాను కల్పిస్తూ వస్తువులు వంటసామాగ్రి గ్యాస్ స్టవ్ సిలిండర్ను అందించారు ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడికి ఉందని పరిస్థితి ఉన్నటువంటి జీవితాల్లో ఇటువంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఇలాంటి సంఘటనలు సంబంధించినప్పుడు అందరు ఐక్యంగా ఉంది వారికి మద్దతు కల్పిస్తూ సహాయం అందించాలని ఇంతటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన పర్ణశాల గ్రామపంచాయతీ యువత చేసిన కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు ఇల్లు లేక రోడ్డున పడ్డటువంటి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే తీసుకొని వెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తెల్లం హరికృష్ణ గజేందర్ నవీన్ సమ్మయ్య రమేష్ వంశి ప్రణయ్ సంతోష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.