UPDATES  

 అంతా నా ఇష్టం ఎవరేం చేస్తారో చూస్తాం నాసిరకం నాణ్యత లోపం*

  • అంతా నా ఇష్టం ఎవరేం చేస్తారో చూస్తాం
  • నాసిరకం నాణ్యత లోపం*
  • ప్రశ్నిస్తే ఆళ్లపల్లి ఎంపీపీ తో వాగ్వాదానికి దిగిన కాంట్రాక్టర్*
  • ఎవరి పర్యవేక్షణ లేకుండానే పనులు

గతంలోనే చెప్పిన మన్యం న్యూస్

మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ విద్యను కార్పోరేట్ దీటుగా విద్యార్థులకు అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను కేటాయించి అభివృద్ధి పనులకు ప్రారంభిస్తే కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొత్తం నాసిరకంగా నాణ్యత లోపం గా పనులను చేయిస్తున్నారు. అంతా నా ఇష్టం ఎవరికైనా చెప్పుకోండి చూద్దాం మేము చెప్పిందే శాసనం మేము చేయాల్సిన పనులు చూసి వెళ్లిపోండి అంటూ ఓ కాంట్రాక్టర్ నిర్వహణ సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీపీ నే హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.కోట్ల రూపాయల భవనాలను కట్టేటప్పుడు సదరు కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో సూపర్వైజర్ దగ్గరుండి చేయాల్సిన పనులను తాపీ మేస్త్రీ కి అప్పజెప్పి తాను ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నాడు. బుధవారం ఆళ్లపల్లి మండలంలో కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న కస్తూరిబాయ్ బిల్డింగ్ కూలిపోయేతోందా అనే చందంగా అక్కడ పనులు జరుగుతున్నాయి నాణ్యతలేని సిమెంట్ ఇటుకలతో ఈ పనులను సదరు గుత్తేదారు చేస్తున్నాడు కట్టుబడిలో సైతం ఇసుక ఎక్కువ మొత్తంలో కలిపి కట్టుబడిన చేసిన కాంట్రాక్టర్ ప్లాస్టింగ్ విషయంలో సైతం నాసిరకం పనులను జరుపుతున్నాడని ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. బుధవారం ఆమె పనులు జరిగే ప్రదేశానికి వెళితే అక్కడ మొత్తం నాసిరకం వస్తువులతో పనులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇలా  నాసిరకం పనులు ఎందుకు చేస్తున్నారని గుత్తే దారుణ ప్రశ్నిస్తే మేము ఇలానే చేస్తాం ఎవరికైనా చెప్పుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానాన్ని ఆమెకి ఇచ్చినట్టు తెలుస్తుంది. గత ఫిబ్రవరిలోగే బిల్డింగును గుత్తేదారు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సింది ఉండగా ఇప్పటికీ పనులు పూర్తికాకపోగా ఇంకా ఏడాది గడిచిన పూర్తయ్యాల కనబడటం లేవని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే కస్తూరిబా పాఠశాలలో 280 మందికి పైగా విద్యార్థినులు ఉండటంతో ఇప్పుడు ఉంటున్న భవనం సరిపోక సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. ఇవన్నీటిని దృష్టిలో ఉంచుకొని త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను అడిగితే వారి వద్ద నుండి నిర్లక్ష్యపు సమాధానం వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో ఇక్కడ జరుగుతున్న పనులన్నీ నాసిరకంగానే ఉన్నాయని మన్యం న్యూస్ తన కథనంలో పేర్కొన్నప్పటికీ తూతూ మంత్రంగా అధికారులు పర్యవేక్షించి మళ్లీ యధావిధిగా నిర్లక్ష్య వ్యవహారం చేయడంతో కాంట్రాక్టర్ ఇష్టమొచ్చిన రీతిలో పనులను జరిపిస్తున్నాడు. 280 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేయాల్సి వస్తే అంత పెద్ద డైనింగ్ హాల్ కూడా ఇందులో లేదని ఆమె పేర్కొన్నారు పూర్తిగా ప్రభుత్వానికి విరుద్ధంగా ఈ నిర్మాణం జరుగుతున్నట్లు ఆమె అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తిచేసి అందించాలని ఆమె పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !