మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు భద్రాద్రి జిల్లా ఆదివాసీ జేఏసీ చైర్మన్ పెండెకట్ల యాకయ్య దొర పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాకయ్య పేరుమీద గవర్నమెంట్ హాస్పిటల్ నందు యాకయ్య అభిమానులు పండ్లు, బ్రెడ్, పాలను రోగులకు పంపిణీ చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని అనేకచోట్ల యాకయ్య మీద ఉన్నప్రేమతో అనేకచోట్ల కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బీసీ సంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునురి గణేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు పోశం వెంకటేశ్వర్లు, హ్యూమన్ రైట్స్ మండల అధ్యక్షులు పొడుగు రాంబాబు, స్వతంత్ర సమాచార హక్కు జిల్లాఅధ్యక్షులు రామ్ కుమార్లు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెండకట్ల యాకయ్య దొర అభిమానులు ప్రవీణ్, నరేష్, రాహుల్, ఆదివాసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
