మన్యం న్యూస్ వాజేడు.
బిఆర్ఎస్ పార్టీ నూగూరు వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోదేబోయిన బుచ్చయ్య ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గిడ్డగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచందు కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాయకుడు సాయి చంద్ మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని. తెలంగాణ ప్రజలను ఆయన తన ఆటపాటలతో అలరించి తెలంగాణ ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారని.వారి అకాలమరణం చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు గొందీ రామారావు, నరసింహారావు, అయ్యవారిపేట సర్పంచ్ బెనిని, నాయకులు పాయం జానకి రమణ, తదితరులు పాల్గొన్నారు.