మన్యం న్యూస్ గుండాల: ప్రమాదవశాత్తు టేకు చెట్టు పడి కార్పెంటర్ కాలం వెంకన్న మృతి చెందిన సంఘటన ఆళ్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని ఇప్పనపల్లి గ్రామ సమీపంలో గల జల్లేరు వాగు ప్రాంతంలో గొగ్గల రామయ్య పొలంలో గాలి దుమారానికి చెట్లు ఒరిగిపోయాయి వాటిని కోసేందుకు కాలం వెంకన్న గురువారం వెళ్లి మిషన్తో కోస్తున్న సమయంలో అకస్మాత్తుగా చెట్టు మీద పడడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆళ్లపల్లి ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
