మన్యం న్యూస్ గుండాల: చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని గుండాల మండలంలో పోడు పట్టాలు అందుకున్న రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పాల్వంచలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సుగుణ గార్డెన్ ప్రాంగణంలో ప్రతి మండలానికి ఒక స్టాల్ ను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన రైతులకు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగదివ్య, ఎంపీపీ ముక్తి సత్యం, రైతు సమన్య సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, రైతులు ఉ ఉకే బాబు, మోహన్ రావు, నరేష్ ఆరేం అప్పయ్య తదితరులు పాల్గొన్నారు
