- ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటాం
- గిరిజనల తరుపున సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు
- పోడు పట్టాలతో గిరిజన జీవితాలలో వెలుగులు
- పోడు పట్టాలు రైతుబంధుతో గిరిజనులకు డబుల్ ధమాకా …
- ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు…
గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని ఎన్నో సంవత్సరాల కలను పోడు పట్టాల పంపిణీ తో సీఎం కేసీఆర్ గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపుతున్న నేపథ్యంలో గిరిజనుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈసందర్భంగా ఆయన మాట్లాదారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనులకు శాశ్వత భూ యజమానులుగా హక్కు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు
గిరిజనుల జీవితాలను బాగు చేయాలనే సదుద్దేశంతో ఈ మహా యజ్ఞం చేపట్టి విజయం సాధిస్తున్నారు అన్నారు, నిన్న భద్రాద్రి జిల్లాలో మొత్తం 50595, పోడు రైతులకు గాను 1,51,195 ఎకరాలకు పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు అన్నారు.
హక్కు పత్రాలు ఇవ్వడమే కాకుండా పెట్టుబడి కి రైతుబంధు ద్వారా నగదును కూడా చెల్లించడం జరుగుతుంది అన్నారు గిరిజన గుడాలు తండాలలో రూ.350 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామన్నారు 75 ఏళ్లలో సాధ్యం కానీ అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే సాధ్యం చేసి చూపించిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు, గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలుస్తారని చెప్పారు అడవి భూములు నమ్ముకుని జీవిస్తున్న పోడు రైతులకు సీఎం కేసీఆర్ హక్కు పత్రాలు ఇవ్వడం ఇక్కడ ప్రజల అదృష్టం అన్నారు .తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.. ఈ సమావేశంలో జడ్పిటిసి పోస్టులు నరసింహారావు, భవాని శంకర్, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.