తింటే గారెలు తినాలి.. ఇది ఒకప్పటి మాట. కానీ తింటే హైదరాబాదీ దమ్ బిర్యానీనే తినాలి.. ఇది హైదరాబాద్ వాసులు అందరూ చెబుతున్న మాట. హైదరాబాద్ బిర్యానికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
హైదరాబాద్ కు వస్తే బిర్యాని రుచి చూడకుండా ఎవరూ వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. అంతగా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయింది.
మన దేశంలోని ఫేమస్ అయిన ఫుడ్ లలో హైదరాబాదీ దమ్ బిర్యాని ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అటువంటి హైదరాబాద్ దమ్ బిర్యాని పైన హైదరాబాద్ వాసుల ప్రేమ మాత్రం అమోఘం. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి లెక్కలతో సహా చెప్పింది.
ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్ వాసులు ఆన్లైన్లో 72 లక్షల బిర్యాని ఆర్డర్లు చేశారని, ప్రపంచ బిర్యాని డే సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి ఐదు ఆర్డర్లలోనూ ఒకటి హైదరాబాదీ బిర్యానీ ఉంటుందని స్విగ్గీ పేర్కొంది. హైదరాబాద్ లో జనవరి 23 నుంచి జూన్ 15 మధ్య ఆర్డర్ల లెక్కను వెల్లడించింది.
ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో హైదరాబాద్ లో బిర్యానీ ఆర్డర్ లు 8.39 శాతం పెరిగాయని స్విగ్గి పేర్కొంది. ఏడాది కాలంలో బిర్యానీ ఆర్డర్ లు 150 లక్షలకు పైగా వచ్చినట్టుగా స్విగ్గి ప్రకటించింది. పైగా తొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్ లతో దమ్ బిర్యాని రికార్డు సృష్టిస్తే, బిర్యానీ రైస్ 7.9 లక్షలు, సింగిల్ బిర్యానీ 5.2 లక్షలతో తర్వాత స్థానాలలో ఉన్నాయని స్విగ్గి పేర్కొంది.
తగ్గనున్న టమాటా ధరలు; మహిళలకు శుభవార్త!!
హైదరాబాద్ నగరంలో బిర్యానీని ఆఫర్ చేసే రెస్టారెంట్లు 15 వేలకు పైగా ఉన్నాయని వీటిలో అధికంగా అమీర్ పేట్, బంజారాహిల్స్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్ , మాదాపూర్, కూకట్పల్లి లోనే ఉన్నాయని, ఇక ఏరియాల పరంగా ఆర్డర్ చూసినట్లయితే కూకట్పల్లి నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి వెల్లడించింది.