మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిదిలోని అనంతరం గ్రామంలో నూతనంగా ఎర్పాటు చేసిన మీసేవా కెంద్రాన్ని ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం ప్రారంబించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మీ సేవ కేంద్రానికి వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కానీ నేడు ఎక్కడికి వెళ్లే పరిస్థితిలేకుండా మన దగ్గర మీ సేవ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ప్రజలను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వారి పనులను త్వరగా పూర్తిచేసేలా చూడాలని మీసేవ నిర్హకులు రామటెంకి పూర్ణ చంద్రశేఖర రావు కి సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
