మన్యంన్యూస్ ఇల్లందురూరల్:-
ఇల్లందు మండల పరిధిలోని బాలాజీనగర్ పంచాయితీ సంజయ్ నగర్ కు చెందిన జోగ అనసూర్య మెడలోని పుస్తెలతాడు ను దొంగలు పట్టపగలే దోచుకున్న సంఘటనతో కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాలాజీ నగర్ గ్రామ పంచాయితీ ఆఫీసు ముందు రోడ్లో నడుచుకుంటూ ఇంటి వైపు వెళ్తున్న అనసూర్యను వెనకనుంచి బైక్ పైన వెంబడించిన ఇద్దరు దొంగలు రెండుతులాల పుస్తెలతాడును చాకచక్యంగా లాక్కుని ఉడాయించారు. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ఉలిక్కిపడిన అనసూర్య కేకలు వేయగా చుట్టుపక్కల జనాలు జమ అయ్యేలోపు దోపిడీ దొంగల తప్పించుకుని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.