- పేదల ఆరోగ్య భరోసా ముఖ్యమంత్రి సహయ నిధి.
- పేదవాడి ఆపద్బంధు ఈ నిధి.
- రేగా ఆదేశానుసారం వేణు చందు కి చెక్కు.
- చెక్కు అందజేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
- కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.
మన్యం న్యూస్ బూర్గంపహడ్:- పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీఎం సహాయక నిధి చెక్కు అందజేత.గతంలో తన ఉన్నత చదువుల శిక్షణా తరగతులకు ఖమ్మం వెళ్లి అక్కడ హాస్టల్ లో ఉంటూ శిక్షణ పొందుతూ ప్రమధవషాత్తు విద్యుత్ ఘతానికి గురయిన బర్ల వేణుచంద్ పూర్తిగా విద్యుత్ కి దహుత అయి కాలిపోగ మెరుగైన చికిత్స కోసం పట్టణ ఆసుపత్రిలో వైద్యం పొంది పునర్ఊపిరి పొందిన వేణుచందు ఈ క్రమంలో వారి తల్లదండ్రులు ముఖ్యమంత్రి సహాయక నిధి కోసం ధరకాస్తు చేసుకొనగా వారికి ముఖ్యమంత్రి హయకనిధి చెక్కు రాగ,ఈ క్రమంలో బూర్గంపహడ్ పట్టణంలో బాధితుని ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆందించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డ్ శ్రీలత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని,ఎటువంటి కష్టమొచ్చినా మన ప్రభుత్వ విప్ రేగన్న అందరికీ ఆత్మీయ భరోసా ఇస్తున్నారని,ఆపత్కాలంలో ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని,ఆరోగ్యంలో పేదలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు,ప్రయివేటు దవాఖానకు పోయి అనవసరంగా మీ డబ్బులు వృథా చేసుకోవద్దని,ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయని అవసరం తరుణంలో ఆ సేవలు ప్రజలు పొందాలని ప్రజలను ఆమె కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు,బూర్గంపహాడ్ పంచాయతీ గౌతమిపురం కి చెందిన బర్ల వేణుచందు కి 60,000 వేల రూపాయల విలువ గల చెక్కును అందజేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం,పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గోనెల నాని,మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాదిక్ పాషా అదేవిధంగా వార్డు మెంబర్ సౌకత్ అలి,మాజీ జెడ్పిటిసి భూపల్లి నర్సింహారావు,మండల నాయకులు గోనెల నరసింహారావు,తోకల శ్రీను,మేకల నరసింహరావు,ఇసంపల్లి వెంకటేశ్వర్లు,బండ్ల తులసి,తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.