మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కార్మిక వర్గ పోరాటాల్లో, సీఐటీయూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్వర్లు శనివారం సింగరేణి వర్క్ షాప్ లో ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహ రావు మాట్లాడుతూ
సీఐటీయూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ అనంతరం సీఐటీయూ ఇతర రంగాల్లో పని చేస్తున్న కార్మిక వర్గ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. అనేక రకాల సమ్మెలల్లో, సింగరేణి సంస్థ రక్షణ కోసం ఐక్య కార్యాచరణ ప్రణాళిక అమలులో కీలక పాత్ర పోషించిన వెంకన్న ను శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు .కె వి ఆర్.ఆంజనేయుల్,మరియు వై.వెంకటేశ్వర్లు,ఎం ఎస్.ప్రకాష్,కె.రమేష్ బాబు,కె.సమ్మయ్య,ఎండి.నాజర్,జి రాజారావు.పాస్నెట్,పాల్గొన్నారు