- పట్టాల పంపిణీపై హర్షం వ్యక్తం చేసిన పినపాక బిఆర్ఎస్ శ్రేణులు
- ముఖ్యమంత్రి కేసిఆర్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు కృతజ్ఞతలు
జూలై 2 న మండల వ్యాప్తంగా గ్రామగ్రామాన పోడుపట్టాల సంబురాలు
అలుపెరుగనిపోరాటం చేసిన విప్ రేగా కు జీవితాంతం ఋణపడి ఉంటాం : ఎంపీపీ గుమ్మడి గాంధీ - పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన పగడాల.
మన్యం న్యూస్, పినపాక:
గిరిజన ఆదివాసీ గూడాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కెసిఆర్, విప్ రేగా వారి హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు అని పినపాక బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన బిడ్డల పూడి భూముల కోసం అలుపెరగని పోరాటం పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు చేశాడని, ఆయన కృషి కేసీఆర్ ఔదార్యం కారణంగానే పట్టాలు పొందబోతున్నారని అన్నారు. గిరిజన గుండెల్లో తనదైన ముద్రను రేగా కాంతారావు వేసుకుంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా జులై 2న మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన పోడు పట్టాల సంబరాలు జరుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, సహకార సంఘం చైర్మన్ రవివర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ లు రజిని, మొగిలిపల్లి నర్సింహారావ్, సీనియర్ నాయకులు ముల్లంగి వెంకట్ రెడ్డి, ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి, కంది సుధాకర్ రెడ్డి, జంపన్న తదితరులు పాల్గొన్నారు.