మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వైద్యశాలలో పని చేస్తున్న వైద్యులు మనీష్ రెడ్డి వైద్యుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం. వైద్య సిబ్బంది మనీష్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, హెచ్.వి పద్మ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు
