మన్యం న్యూస్ బూర్గంపహడ్:- మండల పరిధిలోని సారపాక గ్రామం విజయనగర్ కాలనికి చెందిన గంగాధర్ రమేష్ అనే వ్యక్తి మోత గ్రామ సమీపంలోని రోడ్డు ప్రక్కన గల ఓ పాకలో అనుమాన స్పదంగా మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకున్న బూర్గంపహాడ్ పోలీసులు పంచనామ నిర్వహించి మృతదేహాన్ని శవపరిక్షకై బూర్గంపహడ్ ప్రభుత్వాసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గంగాధర్ 15 ఏళ్ల క్రితం అంద్రా రాష్ట్రం అయిన ప”గో జిల్లా కుక్కునూరు మండలంలోని సీతారామ నగరం గ్రామం నుండి వచ్చి బ్రతుకు దెరువు నిమిత్తం సారపాక గ్రామంలో నివాసం ఉంటున్నట్టు వారి బంధువులు తెలిపారు,ఇతనికి ఒక కుమార్తె,కొడుకు ఉన్నారు