మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ లోని భద్రాచలం సెక్షన్ నందు ఏడో తేదీన జరగనున్న రైల్వే ఇనిస్ట్యూట్ ఎన్నికల్లో భాగంగా మజ్దూర్ యూనియన్ రైల్వే ఉద్యోగుల ఇంటింటి ప్రచారంకు శ్రీకారం చుట్టింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రైల్వే రన్నింగ్ స్టాప్ వద్దకు మజ్దూర్ యూనియన్ నాయకులు ప్రచారం నిర్వహించారు. గడిచిన మూడు దపాలలో మజ్దూర్ యూనియన్ ప్యానెల్ విజయ కేతనం ఎగరవేసిందని నాయకులు అన్నారు. గతంలో యూనియన్ ప్యానెల్ గెలిచిన తర్వాత ఇనిస్ట్యూట్ సభ్యులకు, వారి కుటుంబీకులకు, పిల్లలకు, అనేక రకాల ఆటలు, పాటలు, పోటీలను కుట్లు, అల్లికలు, వంటివి నేర్చుకొనుటలో వారిని ప్రోత్సహించడం జరిగిందని, అదేవిధంగా ఇనిస్ట్యూట్ అభివృద్ధి నిర్వహించడంలో ఎస్ సి ఆర్ ఎం యు ముందడుగు వేసిందన్నారు. భద్రాచలం రోడ్ ఇనిస్ట్యూట్ పేరు , ప్రఖ్యాతలను నేషనల్, జోనల్, స్థాయిలో నిలిపిందని. రైల్వే ఉన్నతాధికారుల చేతుల మీదుగా అనేక బహుమతులు అందుకోవడం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేయడంలో ఎర్రజెండా నాయకులది పై చేయిగా నిలిచిందన్నారు. అనునిత్యం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎస్ సి ఆర్ ఎం యు ఎంతో కృషి చేస్తూ వస్తుందని యూనియన్ ను ముందుకు తీసుకు పోవడంలో నాటి సెక్రటరీ, నేటి డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్.కె ఖాజా బాబా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో తనకు తానే సాటిగా నిలిచాడన్నారు. యువకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావంతుడు, నిండా నాలుగు పదుల వయసు లేని ఎస్కే కాజా బాబా యూనియన్ బి డి సి ఆర్ సెక్షన్ నందు ముందుకు తీసుకు పోవడంలో కార్మికుల పక్షాన మేదో మధు నంగా నిలిచాడన్నారు. ఎన్నికల ప్రచారంలో యూనియన్ సభ్యులు ఓటు అభ్యర్థించుటకు కార్మికుల వద్దకు వెళ్తున్న తరుణంలో సాటి కార్మికుల నుండి వస్తున్న ఆదరణ నను ఇతర యూనియన్లు జీర్ణించుకోలేక అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కార్మికులారా మీ సమస్యలను తీర్చడంలో మద్దూర్ యూనియన్ ముందంజలో ఉన్నది. కాబట్టి ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ ప్యానల్ పై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ యూత్ సెక్రటరీ బసవరి పుల్లయ్య, చైర్మన్ వైజీరావు, ఓం కుమార్, ఆఫీస్ బేరర్లు రామారావు, నాగరాజు, పవన్, రవితేజ, క్రాంతి, రవిరాజు, ఉదయ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.