మన్యం న్యూస్: మణుగూరు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలం లో తుమ్మలచెరువు గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికతో గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలంగాణ సంక్షేమ పథకాలు నేడు దేశాల్లో కూడా అనుసరించే స్థాయికి ఎదిగాయని అన్నారు తెలంగాణలో చేపట్టిన అభివృద్ధిని చూసి అనేకమంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.