మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం నాడు పర్యటించారు. పలు శుభకార్యాలలో పాల్గొని ఆశీర్వాదాలు అందించారు. పలువురుని పరామర్శించి, కష్ట సమయంలో అండదండగా ఉంటానని అభయమిచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాండురంగాపురం వాసి యాట ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుగినేపల్లి ఎంపీటీసీ ఎగ్గడి ఉమాదేవి- సత్యనారాయణ కుమారుడు సాయి కిరణ్ వాహన ప్రమాదంలో కాలికి దెబ్బలు తగలగా వెళ్లి పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో ఉగ్గె నరేష్ ఏర్పాటుచేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఎంపెల్లి గంగయ్య ఆరోగ్యంతో బాధపడి కోలుకొని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న అతనిని పరామర్శించారు. చెగర్శల గ్రామానికి చెందిన రెడ్డమ్మ మనవరాలు నిషిత పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. జిన్నెలగూడెం గ్రామానికి చెందిన పాయం పోతురాజును పరామర్శించారు. కొత్తూరు గ్రామంలోని బొడ్రాయి వేడుకలలో పాల్గొన్నారు. సీతంపేట గ్రామానికి చెందిన గుండారపు ముత్తయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే అతడిని పరామర్శించారు. రేగా విష్ణు చారిటబుల్ ట్రస్టు తరపున 5 వేల ఆర్థిక సాయం అందించారు. అమలాపురం గ్రామానికి చెందిన కుర్సం పగిడియ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తోపాటు, మండల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.