కోరం కనకయ్య నీకు దమ్ము ధైర్యం ఉంటే నీతో పాటు రాజీనామా చేసిన 56 మంది సర్పంచులు, 24 ఎంపీటీసీల పేర్లు శ్వేతపత్రంతో సహా విడుదల చేయగలవా…?
కోరం కనకయ్య శ్వేతపత్రం విడుదల చేస్తే ముక్కు నేలకు రాస్తా..? ఒకవేళ చేయకపోతే నీ ముక్కు నేలకు రాస్తావా…??
కోరం కనకయ్య ఒక రాజకీయ వ్యభిచారి
ఎన్నికల బరిలో కొరం ఒక గడ్డి పూస
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై అవాకులు చవాకులు పేలితే తాటతీస్తాం*
కనకయ్యపై ధ్వజమెత్తిన ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్*
మన్యం న్యూస్,ఇల్లందు:బీఆర్ఎస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భద్రాద్రి జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పార్టీని దూషిస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కోరం కనకయ్య మీద ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్లు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్లందు ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం నందు ఆదివారం పత్రికావిలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భానోత్ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ ఇచ్చిన పదవిని అనుభవిస్తూ పార్టీమీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య అని కోరం కనకయ్య నీకు నిజంగా సిగ్గు, నీతి అనేది ఉంటే ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చున్న నిన్ను అక్కున చేర్చుకున్న పార్టీ మీద నేడు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఓడిపోయిన నిన్ను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ లతో చర్చించి పార్టీ బీఫామ్ ఇప్పించి నీకు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని ఇస్తే పార్టీ ఇచ్చిన పదవిని అనుభవిస్తూ పాములాగా పాలుతాగి నేడు విషాన్ని కక్కావని అన్నారు. ఏదైతే పొంగులేటిని చూసుకొని పొంగుతున్నావో నీవు నడిచే పొంగులేటి ఏ పార్టీలో ఉంటే సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కుటిల ప్రయత్నాలు చేసి ఏ విధంగా ఒక కుట్రదారుడిగా కొనసాగుతున్నాడో అటువంటి కుట్రదారుడితో కలిసి నీవు ఈరోజు విర్రవీగడం సిగ్గుమాలిన పని అని, ఇది నీ పదవీ వ్యామోహాన్ని మరోమారు ప్రజలకు తెలిసేలా చేసిందన్నారు. శనివారంనాడు నువ్వు ఏదైతే ప్రకటించావో నీతో పాటు 56మంది సర్పంచులు 24మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని తప్పుడు లెక్కలు చూపెడుతున్నావో నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీవు నిజంగా ప్రజలను మోసం చేయని వ్యక్తివైతే ప్రజాక్షేత్రంలో నీతోపాటు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులకి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయగలవా? అని హరిసింగ్ నాయక్ ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు చూపెడుతూ ప్రజలను మోసంచేస్తూ నేడు నీతోపాటు భజనపరులైన నీ అనుచరగణం, ఏదైతే నీకునీడను ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గాన్ని తయారు చేసుకున్నావో అతికొద్ది మంది మాత్రమే రాజీనామా చేస్తే 56మంది సర్పంచులు, 24మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారంటూ తప్పుడు లెక్కలు చూపెట్టడానికి కాస్తైన సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు. రాజకీయ విలువలు కోల్పోయి ఒక రాజకీయ నాయకుడి కంటే తక్కువగా ఒక వ్యభిచారికి ఎక్కువగా ప్రవర్తిస్తున్నావని ఇటువంటి నిన్ను ఒక రాజకీయ వ్యభిచారిగా అభివర్ణించడం తప్ప ఇంకో బిరుదు, ఇంకో పదవి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదని హరిసింగ్ నాయక్ ఎద్దేవా చేశారు. నీతోపాటు రాజీనామా చేసిన సర్పంచుల, ఎంపీటీసీల జాబితాను నీవు విడుదల చేస్తే అందులో నీవు చెప్పినట్టుగానే 56మంది సర్పంచులు 24మంది ఎంపీటీసీలు ఉంటే నాముక్కు ఇల్లందు పట్టణ నడిరోడ్డు మీద నేలకు రాస్తానని, ఒకవేళ చూపించకపోతే తప్పు ఒప్పుకొని నీ ముక్కు నేలకు రాస్తావా అంటూ సవాలు విసిరారు. పొంగులేటి డబ్బును చూసి ఆయన వర్గంలో చేరిన కోరం కనకయ్య వాళ్ళది పెద్దడ్రామా కంపెనీ అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ది చేసి, దేశవ్యాప్తంగా పేరు ఘడించిన బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చెబుతున్న నీవు అదే పార్టీలో ఐదుసంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావని, రెండోదఫా జిల్లా జడ్పీ చైర్మన్ గా కొనసాగిన సంగతి మర్చిపోయావా అన్నారు. అభివృద్ధి జరగనిదే ఆ పార్టీలో కొనసాగావు అంటే నీవు ఒక చేతగాని ఎమ్మెల్యేవా?, అంటే ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యావా అని వారు ప్రశ్నించారు. అబద్ధాలు, బ్రోకర్ మాటలు చెప్పడంలో నిన్ను మించినవారు మరెవరులేరని వ్యాఖ్యానించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ..ఖమ్మంలో జరగిన సభ చేరికల సభకాదని భట్టి పాదయాత్ర ముగింపుసభ అని వాపుని చూసి బలుపు అన్నట్లుగా ఏదో మీ చేరికలతో సభ నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. అంతేకాకుండా వేరే పార్టీ నుండి లేదా ఇండిపెండెంట్గా గెలిచిన ప్రజాప్రతినిధులను కూడా బీఆర్ఎస్ పార్టీఖాతాలో వేసి రాజీనామా చేసారని చెప్పటం కోరం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 14 సంవత్సరాల ఉద్యమ పార్టీ 9 సంవత్సరాలుగా ప్రజాసంక్షేమ ఫలాలను అందిస్తూ, ప్రజారంజకంగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ని విమర్శించిన వారు డ్రెస్సు అడ్రస్సు లేకుండా గల్లంతయ్యారని అందులో నీవెంత అని ఎద్దేవా చేశారు. నిజంగా దమ్ముధైర్యం ఉంటే నీతో పాటు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులను పరిచయం చేస్తూ వారివారి సర్పంచ్ స్థానాలతో సహా నిరూపించగలవా అని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇస్తానని ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో దాదాపు 1300 మంది యువతీయువకులు ఆత్మబలి దానాలు చేసుకున్నారని అటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన నీవు నీకునీవుగా స్వయంగా ఆత్మబలిదానాన్ని చేసుకున్నట్టే అని చమత్కరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీమీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతావని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉంటూ అభివృద్ధిలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రంమీద కుట్రదారుల కన్నుపడి ఏవో చేయాలని పగటికలలు కంటూ పిచ్చిపనులు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ప్రజలేవారికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. ఇల్లందు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ఇల్లందు డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ను ప్రజలు మరోమారు గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని, ఎవరెన్ని కుటిల ప్రయత్నాలు చేసిన వారిపాచికలు పారవన్నారు. ఇల్లందులో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని, హరిప్రియ విజయాన్ని ఆపటం ఎవరితరం కాదని రాజేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఇల్లందు ఉపాధ్యక్షుడు ఎస్ రంగనాథ్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి,11వవార్డ్ కౌన్సిలర్ జేకే శీను, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకులు, మండల ఇంచార్జ్ యలమద్ది రవి, మండల కోఆప్షన్ సభ్యులు ఘాజి, ఇల్లందు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కాటం సైదులు, ఎలమందల రమేష్, సనా రాజేష్, చిన్నారి, వైశాఖ సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.