మన్యం న్యూస్ చండ్రుగొండ, జులై 02 : నియోజకవర్గానికి వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్టు ఏర్పాటు చేయడానికి వడ్డెర సంఘం జిల్లా నాయకులు ఉప్పతల ఏడుకొండలు ఆదివారం వడ్డెర సంఘం కులస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర చైర్మన్ జరుపుల సత్యనారయణరాజు, జిల్లా నాయకులు డేరంగుల బ్రహ్మం, నర్ర ఎల్లయ్య ఆదేశాల మేరకు200 మంది కులస్తులతో సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ వడ్డెర ఆత్మ గౌరవ భవన సముదాయాల ట్రస్టు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.ఈ ట్రస్తులో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ ద్వారా నిరుపేద వడ్డెరలకు ఆరోగ్య, విద్య , ఆర్థిక స్థితిగతులపరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో దమ్మపేట అధ్యక్షులు కృష్ణ, సత్యం, వడ్డెర సంఘం నాయకులు కుంచెపు కాశి, దండుగుల సాంబశివరావు, చల్లా జానకిరాములు, చింతల భూపాల్, ఉప్పతల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.