మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై 17: కొండరెడ్ల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ అన్నారు. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల పంచాయతీలోని కొండరెడ్డి ఆవాసమైన గోగులపూడి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న విషయం పాఠకులకు విదితమే. అయితే సోమవారం నాబార్డు 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైద్రాబాద్ నాబార్డు కార్యాలయంలో గోగులపూడి వాసి గోగులు సీతకు గవర్నర్ చేతుల మీదగా నిధులు మంజూరి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గోగులపూడి వాసులు హర్షం వ్యక్తం చేశారు.