ప్రతి పల్లెకు రహదారి సౌకర్యం కల్పించడమే నా లక్ష్యం
మన్యం న్యూస్ గుండాల: గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ప్రతిపల్లె రహదారి సౌకర్యం కల్పించడమే నా లక్ష్యమని ప్రభుత్వ విన్నపాక ఎమ్మెల్యే వేగ కాంతారావు అన్నారు. సోమవారం రెండు మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులను పరివేక్షించారు. మండల కేంద్రం నుంచి మఠం లంక వెళ్లే రహదారి మార్గమధ్యలో గల వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆయన పరవేక్షించారు. ఆళ్లపల్లి మండలంలోని జల్లేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను సైతం ఆయన పర్యవేక్షించారు
