మన్యం న్యూస్,ఇల్లందు*: గిరిజనేతరుల హక్కుపత్రాలు, జీవనహక్కుల రక్షణ కొరకు గురువారంనాడు నియోజకవర్గ కేంద్రమైన ఇల్లందు పట్టణంలో భారీ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్లు గిరిజనేతర హక్కుల పోరాట ఐక్యవేదిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగల్ల మాధవరావు తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ..గురువారం ఉదయం పదకొండు గంటలకు కరెంట్ ఆఫీస్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి తహసిల్దార్ కార్యాలయం వరకుఏజెన్సీ గిరిజనేతరులకు పోడుభూములకు హక్కుపత్రాలు, జీవించేహక్కుల రక్షణకొరకుతదితర సమస్యలపై పట్టణంలో భారీప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్, జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్య, తహశీల్దార్ కృష్ణవేణిలకు ఏజెన్సీప్రాంత గిరిజనేతరుల సమస్యలు తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని పులిగల్ల మాధవరావు తెలిపారు. ఈ నేపథ్యంలో గిరిజనేతరుల హక్కులకై జరుగు ఈ ప్రదర్శనకు భారీసంఖ్యలో అభిమానులు, గిరిజనేతరులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
