బెదిరిస్తే బెదిరిపోయే తత్వం పొంగిలేటిది కాదు
రాజకీయ ఒత్తిళ్లలకు తలొగ్గేది లేదు …….
తాండ్ర నాగబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
బెదిరిస్తే బెదిరిపోయే తత్వం కాంగ్రెస్ నాయకులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ది కాదని రాజకీయ వ్యక్తులకు తలగేది లేదని మంగళవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని శ్రీనివాస రెడ్డి యువసేన తాండ్ర నాగబాబు ఆధ్వర్యంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎస్సార్ గార్డెన్ పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా తాండ్ర నాగబాబు మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తే , నేడు ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఎన్ ఎస్ పి భూమి కలిసి ఉందనే ఆరోపణలతో , ఎన్ఎస్పి అధికారులు, చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఈ ఫంక్షన్ హాల్ నిర్మించే సమయంలో ప్రభుత్వపరంగా అన్ని అనుమతులతో ఈ నిర్మాణం జరిగింది అని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొంగులేటి శీనన్న పై కక్ష సాధింపుచర్యలను చేపడుతుందని ఇట్టి చర్యలకు భయపడేది లేదని అన్నారు. ఎస్ ఆర్ గార్డెన్ నిబంధనలకు అనుగుణంగా నిర్మించడం జరిగిందని దానిని సర్వేల పేరుతో పొంగులేటి శీనన్నను ఇబ్బంది పెట్టే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని, ఈ చర్యలకు అభిమానులు ఎవరు సహించేది లేదని ఈ ప్రభుత్వ వైఖరిని ఎండ కట్టారు. పార్టీ మారారనే అక్కసుతో ఈ విధమైనటువంటి దిగజారుడుచర్యలు చేపట్టడం సిగ్గుచేటు. ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోకపోతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శీనన్న అభిమానులు తగిన గుణపాఠం చెబుతారు. కళ్ళుండి చూడలేని ఈ గుడ్డి ప్రభుత్వ చర్యలకు నిరసనగా నల్లటి గుడ్డలతో కళ్ళకు కంతల కట్టుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ రామ్ లక్ష్మణ్, మారెడ్ల నరసింహారెడ్డి, రావూరి వీరభద్రం,పంతంగి రామకృష్ణ, బేతం శ్రీను,గుంపుల కొమరయ్య, క్రాంతి, చందు, కదిర్, గంపల చంద్రమ్మ, సావిత్రి, ముత్యాల రాణి, స్వర్ణ భాయ్, బేతం వెంకటేశ్వర్లు, రాజు పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.