UPDATES  

 మానవత్వం పరిమళించి మానవత్వం చాటుకున్న మునిసిపల్ చైర్ పర్సన్- కాపు సీతాలక్ష్మీ

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోనిరామవరం ప్రాంతంలో ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ జీవనాన్ని సాగిస్తున్న వయోవృద్ధు మంగళవారంఉదయం హఠాత్తుగా మరణించారు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న మునిసిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మీ సంఘటన స్థలానికి చేరుకొని, స్థానిక కౌన్సిలర్ మునిగడప పద్మ మునిసిపల్ సిబ్బందితో సమన్వయం చేసుకొని అప్పటికప్పుడు 2 వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ తో మాట్లాడి పోలీసు వారిని పిలిపించి పంచనామా నిర్వహింపజేసి శవాన్ని కొత్తగూడెం మునిసిపల్ వైకుంఠ రధం ద్వారా అక్కడి నుండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపజేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల శవ నిర్ధారణ ధ్రువీకరణ ఇప్పించి ప్రభుత్వ ఆస్పత్రి నుండి గొదుమవాగు (రామవరం) స్మశానవాటికకు తరలించి ఖనన కార్యక్రమం అంత అయిపోయెంత వరకు మునిసిపల్ సిబ్బందితో ఉండి కార్యక్రమం దగ్గర ఉండి జరిపించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు 10వ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ కూడా ఉన్నారు.
మునిసిపాలిటి పరిధిలోని 36 వార్డులలో ఎటువంటి పనులు చేయడంలో అయిన మా యొక్క మునిసిపల్ సిబ్బంది వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించి కష్టపడి పనిచేస్తున్నారని, మా పారిశుద్ధ్య కార్మికుల పనితీరు ఎల్లవేళలా అభినందనియమేనని, వారి సేవలు మారువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గౌస్, మొయినుద్దీన్, మజీద్, చంద్రయ్య మునిసిపాలిటీ నుండి శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహాన్, జవాన్లు రామారావు, రాజేష్ మరియు పారిశుద్ధ్య కార్మికులు హంజత్ ఖాన్, రాము, ఓదేలు, రాంరాజేష్, సల్మాన్ లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !