మన్యం న్యూస్: జూలూరుపాడు, జూలై 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించాలనే కార్మికుల యూనియన్ పిలుపులో భాగంగా, వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సిఐటియు, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని ఈ సందర్భంగా సిఐటియు ఎస్ఎఫ్ఐ నాయకులు యాస నరేష్, గార్లపాటి పవన్ కుమార్ లు ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారికి మద్దతు ప్రకటిస్తే, ప్రజా సంఘాల నాయకులను ఇలా అక్రమ అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. అక్రమ అరెస్టులతోటి ప్రజా ఉద్యమాలను ఆపలేరని, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని, వారికి కనీస వేతనం రూ.19,500 రూపాయలు ఇవ్వాలని, ట్రాక్టర్ డ్రైవర్, బిల్ కలెక్టర్లకు రూ.19,000 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.