మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 18: అశ్వారావుపేట నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా ఇంటింటి ప్రచారానికి కొనసాగిస్తున్న టిపిసీసీ సభ్యురాలు కాంగ్రెస్ యువ నాయకురాలు వగ్గెల పూజ. దానిలో భాగంగా ప్రచారానికి వెళ్తూ మార్గ మధ్యలో వరి నాటు వేస్తున్న రైతు కూలీలతో కలిసి నాటు వేశారు, అదేవిదంగా పొలంలో ట్రాక్టర్ కూడా నడిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతు జీవితాల్లో వెలుగులు వస్తాయని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తథ్యం అని రైతుకులీలకు అండగా నిలుస్తామని టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తునందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతే-రాజు అవుతాడని, భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని ఆమె వారితో అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టం వెంకటేశ్వర్లు, గొగ్గెల కోటేశ్వరరావు, ఉకె మోహన్ రావు, సడియం వెంకటేశ్వరరావు, ములకలపల్లి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పాలకుర్తి రవి, సడియం రాంబాబు, వరస రాంబాబు, మడివి రమణ, కట్టం వెంకటలక్ష్మి, సున్నం నాగమణి, కుండ్రు దుర్గ, సడియం రాజ్యం, మందలపల్లి వార్డు మెంబర్ సీనియర్ నాయకులు సిరినేని వెంకయ్య, దమ్మపేట ఎస్సి సెల్ అధ్యక్షులు తిరుపతిరావు, ఎస్కె బషీర్ తదితరులు పాల్గొన్నారు