మన్యం న్యూస్, దమ్మపేట, జులై, 18: గ్రామపంచాయతీ కార్మికులు (జేఏసీ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 13వ రోజు సమ్మెలో స్థానిక శాసనసభ్యులు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇంటిని ములకలపల్లి గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం ముట్టడించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ సమస్యలను పంచాయతీరాజ్ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి అశ్వారావుపేట మండలాల గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ నాయకులు ఆవులూరి రాంబాబు, బైటి అశోక్, చిక్కుల శ్రీను, కే సాయిరత్న, కొక్కెర గడ్డ సతీష్, గద్దల మహేష్, చిటికె రామకృష్ణ, బొబ్బిలి బాబురావు, మరీద్ రామ్, సురేష్ తదితరలు పాల్గొన్నారు.