సీజనల్ వ్యాధులు తస్మాత్ జాగ్రత్త
ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలి*
వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి డి ఎం ఎన్ హెచ్ ఓ శిరీష*
మన్యం న్యూస్ గుండాల: ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యశాఖ అధికారిని శిరీష స్థానిక వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆమె తనిఖీ చేశారు ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డును సైతం ఆమె సందర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆమె సిబ్బందికి సూచించారు. మండలంలోని అన్ని ప్రాథమిక హెల్త్ సెంటర్ల వద్ద సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు ఉండేలా వైద్య సిబ్బంది చూసుకోవాలని అన్నారు. ఆస్పత్రి డాక్టర్ల నివాస భవనాలను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆమె ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యశాల వైద్యుడు మనీష్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
