మన్యం న్యూస్ చర్ల:
భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని లక్ష్మీనారాయణ ఆదేశానుసారం మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడుతు స్థానిక భద్రాచలం పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య డౌన్ డౌన్ అంటూ చర్ల అంబేద్కర్ సెంటర్ నందు వీరయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాపుకృష్ణ మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో ఎటువంటి పనులు చేపట్టలేని ఈ ఎమ్మెల్యే కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజారావు, ఇరస వడ్ల రాము, లంక రాజు, అయినవోలు పవన్ కుమార్, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కాపుల నాగరాజు, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, కేశవపురం సర్పంచ్ కోరం నాగేంద్ర,ఉప సర్పంచ్ గోసుల మురళి, తూర్రం రవి, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, తడికల లాలయ్య, అజీజ్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు తతీదరులు పాల్గొన్నారు.
