- రోగాలు సోకి చచ్చిపోతున్న సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు పొమ్మనలేక పొగ పెడుతున్న సింగరేణి యాజమాన్యం…!
- సింగరేణి ప్రభావిత ప్రాంతంలో మచ్చుకు కానరాని హెల్త్ క్యాంపులు…!
- కరోనాకాలం నుంచి నేటి వరకు ఇదే దుస్థితి ఒక్క హెల్త్ క్యాంప్ పెట్టిన దాఖలు లేదు…?
- ఏజెన్సీ గ్రామాల్లో ఎమర్జెన్సీ హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేయాలి…
- సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి…
మన్యం న్యూస్ మణుగూరు…మణుగూరు ఏరియా సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు…? కరోనా కాలం నాటి నుంచి నేటి వరకు ప్రభావిత ప్రాంతంలో కనుమరుగైన హెల్త్ క్యాంపులు గురించి మాట్లాడే యూనియన్ నాయకుడు కరువైపోయారు . మారుమూల ఏజెన్సీ గ్రామాల ప్రజలు విష జ్వరాల బారిన పడి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని , వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించి అన్ని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక వైద్య బృందాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి సరైన మందులు అందించి వారి ప్రాణాలు కాపాడటానికి చర్యలు చేపట్టాలని కర్నె రవి కోరారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలు అయినటువంటి కొత్త మల్లె పెళ్లి , కొత్త కొండాపురం పద్మ గూడెం, విటల్ రామ్ నగర్, బుగ్గ ఖమ్మంతోగో , శాంతినగర్ , విప్పల గుంపు, రామానుజరం, సాంబాయిగూడెం, తదితర ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై సింగరేణి యాజమాన్యం స్పందించాలి అన్నారు. ఈ సందర్భంగా కర్నే రవి మాట్లాడుతూ…
ఏజెన్సీలోని గ్రామాల ప్రజలు టైఫాయిడ్ , మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలతో పాటు, వైరల్, సీజనల్ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు వైద్యం నేడు అందని ద్రాక్షలా వేలాది రూపాయల ఖర్చులతో ఖరీదైనదిగా మారిన నేటి ఈ పరిస్థితుల్లో నిరుపేదల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని అన్నారు.ప్రభుత్వ అధికారులు అక్కడక్కడ మొక్కుబడి వైద్య శిబిరాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు
పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని పేదల దరికి చేర్చకుండా కార్పొరేట్ వైద్యవిధానానికి తలుపులు తీసి వైద్య రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చి వేశారని అన్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజనల్ వ్యాధుల బారిన పడి అనేకమంది నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్నారనీ అన్నారు పేదల వైద్యానికి నిధులు కేటాయించి ఇప్పటికైనా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సింగరేణి యజమాన్యం డిమాండ్ చేశారు.