మన్యం న్యూస్: జూలూరుపాడు, జూలై 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండలంలోని కాకర్ల సబ్ సెంటర్ పరిధి లో గల గురువాగు తండా గ్రామంలో మంగళవారం స్థానిక పి హెచ్ సి వైద్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం లోని రోగుల రక్త నమూనాలను సేకరించి, రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలలో భాగంగా, షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోని పాఠశాలలు, గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా, వైద్యుల సూచనలను అందరూ పాటించాలని కోరారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్వి, హెచ్ ఎస్ రత్నకుమార్, సర్పంచ్ బొజ్జ నాయక్, కార్యదర్శి సరిత, ఏఎన్ఎం అనూష, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.