UPDATES  

 సీతంపేట బ్రిడ్జి కీ సీత కష్టాలు ఎప్పుడు తీరేనో రూ.6కోట్లు వెచ్చించిన ఆదరణ కరువు

సీతంపేట బ్రిడ్జి కీ సీత కష్టాలు ఎప్పుడు తీరేనో
రూ.6కోట్లు వెచ్చించిన ఆదరణ కరువు
నత్తనడకన సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు
– బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్

మన్యం న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రం నుంచి సీతంపేట బంజర తదితర గ్రామాలకి వెళ్లేందుకు రూ.6కోట్ల వ్యయంతో నిర్మాణం తలపెట్టిన సీతంపేట బ్రిడ్జి నత్తనడకన సాగుతుందని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి సీతంపేట వద్ద నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న బ్రిడ్జి వర్షాల దాటికి కుప్పకూలిపోయిందని,ఆ బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం 6 కోట్ల పైగా వ్యయంతో 2021లో పనులు ప్రారంభించారని తెలిపారు.నిధులు కేటాయించి సంబంధిత అధికారులు చేతులు దులుపుకోవడంతో పనులు జరగడంలేదని ఆరోపించారు.గతంలో ఉన్న సీతంపేట బ్రిడ్జి కృంగిపోయిందని,కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి రెండు సంవత్సరాలు దాటిన ఇంకా బ్రిడ్జి కట్టడం పనులు పూర్తి కాకపోవడంతో సుజాతనగర్ మండలం నుంచి బ్రిడ్జి మీదుగా వెళ్లవలసిన సీతంపేటబంజరు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని అన్నారు.ఆరు కోట్ల పైగా వ్యయంతో నిర్మాణం జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులు ఏమాత్రం పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్మాణం కోసం పనులు కేటాయించి సంవత్సరం దాటుతున్నప్పటికీ పనులు జరగడం లేదని అన్నారు.సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పనులు సక్రమంగా,నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,మండల అధ్యక్షుడు గుండేటి ఆదినారాయణ,జిల్లా కార్యదర్శులు మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,తాటిపాముల హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !