ఎమ్మెల్యే బయటికి వస్తారా..? మా సమస్యలూ పరిష్కరిస్తారా…?
గ్రామపంచాయతీ కార్మికులు ఎమ్మెల్యే వనమా ఇల్లు ముట్టడి ఆందోళన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గ్రామాలను పణంగా పెట్టి ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం అనునిత్యం చేస్తున్నామని మా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటారా లేదా గాలికి వదిలేస్తా రా అని డిమాండ్ చేస్తూ.. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వనమా ఇంటిని గ్రామపంచాయతీ కార్మికులు ముట్టడించి ఆందోళన చేపట్టారు.
గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా……….
రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ పిలుపుమేరకు 13వ రోజు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల ఇంటిముందు ధర్నా పిలుపునివ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఇంటిముందు సుజాతనగర్ చుంచుపల్లి లక్ష్మీదేవి పల్లి పాల్వంచ మండలాల కార్మికులు ధర్నా చేయడం జరిగింది ఎమ్మెల్యే వనమా తో కార్మికులు మాట్లాడుతూ వారి యొక్క సమస్యలను గ్రామపంచాయతీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలి జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామపంచాయతీ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల రూపాయల బీమా ఇవ్వాలని గ్రామపంచాయతీ కనీస వేతనం అమలు చేయాలని గ్రామపంచాయతీలో పని చేసే కార్మికుల జీతాలు కొరకు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాండ్ ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది గ్రామాల్లో వారు చేస్తున్నటువంటి పనులను వివరించి వారి న్యాయమైన డిమాండ్లను పంచాయతీ శాఖ మినిస్టర్ గౌరవ ఎర్రబల్లి దయాకర్ తో మాట్లాడి మా సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది ఎమ్మెల్యే వనమా సానుకూలంగా స్పందించి వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చుంచుపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి మురళి గారు, సిపిఐ జిల్లా నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ,సిపిఎం పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ ఏఐటిసి జిల్లా అధ్యక్షులు నారాటి ప్రసాద్ జేఏసీ చైర్మన్ తేజ రమేష్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ యూసఫ్ కో కన్వీనర్ దుంపల అమర్ నాద్ గౌరవ సలహాదారుడు కిషోర్ కుమార్ సలీం బండ రామకృష్ణ సురేష్ దుర్గ ప్రసాద్ ప్రవీణ్ వంశీ వెంకన్న అనిల్ వీర వెంకట పూర్ణం కనకలక్ష్మి మంజుల ఆదిలక్ష్మి నాగేశ్వరరావు బండ అశోక్ శ్రీకాంత్ కృష్ణవేణి సరోజ తదితరులుపాల్గొన్నారు.