UPDATES  

 కడిగిన ముత్యంముఖ్యమంత్రి కేసీఆర్

కడిగిన ముత్యంముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ పైన పోలీస్ కేసు హాస్యాస్పదం
బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి

మన్యం న్యూస్ వాజేడు

 

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షిప్తంగా న్యాయాన్ని సమకూరు మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కడిగిన ముత్యమని అలాంటి కెసిఆర్ పైన పోలీసులు కేసు పెట్టడం హా స్యస్పదమని సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య భద్రాచలం నియోజకవర్గం నికి నాలుగున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు అభివృద్ధి సాధించింది ఉందా, మీరు తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి చేసిన పనులు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యే వీరయ్య పై విరుచుకుపడ్డారు భద్రాచలం నియోజకవర్గం లో గాని వాజేడు మండలంలో గాని తట్టెడు మట్టి పోయని మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మీద కేసు పెట్టడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ కేసు వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరించారు. వాజేడు పార్టీ మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై పెట్టిన కేసు ను వెనక్కి తీసుకోవాలని భద్రాచలం నియోజవర్గ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కి హెచ్చరించారు, అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గం లో ప్రతి మండలానికి ఒక ఏజెంట్ ని పెట్టుకొని దళితులకు దళిత బంధు ఇస్తామంటూ సుమారు ఒక్కరికి రెండు లక్షల రూపాయలు దాకా తీసుకున్న పరిస్థితి దళితులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉన్న భూముల సైతం అమ్ముకొని దళిత బంధువస్తే కష్టాలు కరతేరుతాయని ఆశతో 2 లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ 8 నెలల కాలం గడుస్తున్న ఇంకా దళిత బంధు రాకపోగా తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని, దళితులు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయలను తిరిగి దళితులకు ఇవ్వాలంటూ ఘాటుగా హెచ్చరించారు , ఈ కార్యక్రమంలో కోశాధికారి పోలూరు వేణుగోపాలరావు జాయింట్ సెక్రెటరీ చేన్నం సాంబశివరావు, చెన్నం సారబాబు చెన్నాం శ్రీను చెన్నం కృష్ణ బాబు చెన్నం కుమార్ తల్లడి వెంకటేశ్వర్లు సేగెం ప్రశాంత్ వాజేడు సోషల్ మీడియా వారియర్ అల్లి ప్రశాంత్ యాలం దయాసాగర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !