- మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి
- ఇల్లందు మున్సిపాలిటీలో ప్రారంభమైన మొక్కలు పంపిణీ కార్యక్రమం
- పలువార్డులలో ప్రజలకు మొక్కలు పంపిణీచేసిన మున్సిపల్ చైర్మన్ డీవీ
మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని రెండు నాలుగు వార్డులలో ఇల్లందు పురపాలక ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వార్డుప్రజలకు మొక్కలు పంపిణీ చేసారు. అనంతరం చైర్మన్ డీవీ మాట్లాడుతూ..ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచన మేరకు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిఇంటికి ఆరుమొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. తీసుకున్న ప్రతిమొక్క బతికేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు. మీ అందరి కృషివల్లే హరితహారంలో ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు కూడా తీసుకున్నామని అదేవిధంగా ఈసారి కూడా ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించి ఇల్లందు మున్సిపాలిటీని మరోమారు హరితహారంలో అగ్రగామిగా నిలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లు కటకం పద్మావతి, సయ్యద్ ఆజం, ఏఈ శంకర్, బారాస నాయకులు ఎర్ర ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు