మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మె లో భాగంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నందు చుంచుపల్లి మండలం లక్ష్మీదేవి పల్లి మండలం కార్మికుల సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపిన విద్యానగర్ కాలనీ సర్పంచ్ బానోత్ గోవిందు మాట్లాడుతూ మీయొక్క సమస్యలు న్యాయపరంగా ఉన్నాయి 14 రోజులుగా చేస్తున్న సమ్మెకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం చాలా దురదృష్టమని వారు చేస్తున్న సేవలకి ఎంత ఇచ్చిన తక్కువేనని కరోనా లాంటి కష్టకాల సమయంలో కూడా వారు శ్రమ చేశారని కార్మికులు చేస్తేనే జాతీయ అవార్డులు వచ్చాయని అట్టి కార్మికులను పట్టించుకోక పోవడం న్యాయం కాదని ఇప్పటికైనా వారి సమస్యలను ప్రభుత్వం గుర్తించి కార్మికులకు న్యాయం జరగాలని కోరుతూ విద్యానగర్ కాలనీ సర్పంచ్ అయిన నేను వారి యొక్క సమస్యలకు పూర్తి మద్దతు తెలుపుతూ మా గ్రామపంచాయతీ నుంచి వార్డ్ మెంబర్లం ఎంపీటీసీ ఉప సర్పంచ్ కో ఆప్షన్ నెంబర్ అందరం కలసి వారి యొక్క సమస్యల పరిష్కారం గురించి తీర్మానం చేసి అధికారులకు ఇస్తామని చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ ఎంపీటీసీ బానోతు లక్ష్మి వార్డ్ మెంబర్స్ పూర్ణ కాళిదాస్ బలగం శ్రీధర్ భాగం మహేశ్వరరావు పోతన బోయిన కృష్ణ కో ఆప్షన్ సభ్యులు వాడపల్లి జకరయ్య నాయకులు చుంచుపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి మురళి గారు ఎఐటిసి జిల్లా జనరల్ సెక్రెటరీ గుత్తుల సత్యనారాయణ జేఏసీ కన్వీనర్ దుంపల అమర్ నాథ్ గౌరవాధ్యక్షులు కిషోర్ కుమార్ బండ రామకృష్ణ వెంకన్న సలీం సురేష్ కుమార్ వీర వెంకటి రమేష్ పూర్ణ మంజుల కనక లక్ష్మి కృష్ణవేణి ఆదిలక్ష్మి సరోజ బోస్ దుర్గాప్రసాద్ షరీఫ్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు